బ‌న్నీ, ఎన్టీఆర్‌ల సినిమా

ntr
క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖ‌మూ..
టాలీవుడ్ దిమ్మ‌తిరిగే మ‌ల్టీస్టార‌ర్‌!
అటు నంద‌మూరి చిన్నోడు, ఇటు మెగా బుల్లోడు..!
అభిమాన `హ‌ద్దులు` చెరిపేయ‌డానికి ఇద్ద‌రు హీరోలు కంక‌ణం క‌ట్టుకొన్నారు..! ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్ట‌డానికి రెడీ అయ్యారు. అవును… ఎన్టీఆర్‌, అల్లు అర్జున్ కల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోవ‌డానికి స‌న్నాహాలు చేరుగుతున్నాయి. మ‌హేష్ బాబు, వెంకటేష్‌ని క‌ల‌పి మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి స‌రికొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిన దిల్‌రాజు.. ఇప్పుడు ఎన్టీఆర్‌, బ‌న్నీల‌తో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు టాలీవుడ్ టాక్‌. ఈ చిత్రానికి వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని స‌మాచార‌మ్. క‌ల‌సి ఉంటే క‌ల‌దు సుఖ‌మూ… అనే పేరుతో ఆయ‌న ఓ క‌థ రాసుకొన్నారు. ఉమ్మ‌డి కుటుంబ నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఎన్టీఆర్‌, బ‌న్నీల‌ను దృష్టిలో ఉంచుకొనే క‌థ రెడీ చేశార‌ట‌. లైన్ కూడా ఇద్ద‌రు హీరోల‌కూ వినిపించార‌ట‌. ఇప్పుడు స్ర్కిప్టు ద‌శ‌లో ఉంది. ఈ క‌ల‌యిక నిజ‌మై, ఎన్టీఆర్ – బ‌న్నీ క‌ల‌సి సినిమా చేస్తే.. ఎన్ని రికార్డులు బ‌ద్ద‌ల‌వుతాయో..? ఎన్ని సంచ‌ల‌నాలు న‌మోద‌వుతాయో. ఆ మెగా మ‌ధుర క్ష‌ణాల కోసం ఎదురుచూద్దాం.