Site icon TeluguMirchi.com

చరణ్ కు హ్యాట్సాఫ్‌ చెప్పిన ఎన్టీఆర్


సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్‌ ఒదిగిపోయాడంటూ అటు ప్రేక్షకులే కాదు ఇటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ‘యంగ్‌టైగర్’‌ ఎన్టీఆర్‌ కూడా చేరిపోయారు. ఇవాళ సినిమా వీక్షించిన అనంతరం ట్విటర్‌లో చిత్ర బృందాన్ని అభినందించారు.

‘ఇప్పుడే ‘రంగస్థలం’ చూశాను. హ్యాట్సాఫ్‌ చరణ్‌. ప్రస్తుతం నువ్వు అందుకుంటున్న ప్రశంసలకు అర్హుడివి. నా నుంచి కూడా ఒకటి అందుకో. మరెవరూ ఇంతకంటే బాగా చేయలేరు. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపిన సుకుమార్‌కు అభినందనలు. . సమంత, దేవిశ్రీప్రసాద్‌, మైత్రి మూవీస్‌, ‘రంగస్థలం’ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ ట్వీట్‌ చేశారు తారక్.

Exit mobile version