ఎన్టీఆర్ 30 షురూ..


ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్‌ను గెలిచిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై ఆర్ ఆర్ ఆర్ నాటు నాటుకు ఆస్కార్ అవార్డ్ దక్కింది. దీంతో టీమ్ సంబరాల్లో మునిగితేలుతోంది. ఇక ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం అక్కడి హాలీవుడ్ మీడియా తో మాట్లాడారు ఎన్టీఆర్. ఈ మేరకు తన నెక్స్ట్ మూవీ పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది అని, ఆర్ ఆర్ ఆర్ మూవీ క్వాలిటీ కు మ్యాచ్ అవుతుంది అని అన్నారు. అంతేకాదు ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ కానుంది అని.. ఈ చిత్రం కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఇక మొదటి షెడ్యూల్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేస్తున్న ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా ఉండనుందట.

ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా 2024 ఏప్రిల్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది.