Site icon TeluguMirchi.com

రిక‌మెండేష‌న్లు ప‌నిచేయ‌వు

Kajalప‌రిశ్రమ‌లో ఎవ‌రి ప్రతిభ‌తో వాళ్లు నెగ్గుకు రావాలి. ఒక‌రి రిక‌మెండేష‌న్లు ప‌నిచేయ‌వు… అంటోంది కాజ‌ల్‌. ఈ మాట ఎందుకు చెప్పిందంటే, త‌న ద‌గ్గర‌కు వ‌స్తున్న ద‌ర్శక నిర్మాత‌ల‌కు ఒక్కోసారి త‌న చెల్లెలు నిషా అగ‌ర్వాల్ పేరు సిఫార్సు చేస్తోంద‌ట‌. `నా డేట్లు ఖాళీ లేవు. నిషా అయితే ఈ పాత్రకు ప‌ర్‌ ఫెక్ట్‌` అని చెబుతోంద‌ట‌. ఇదే విషయం కాజ‌ల్‌ ని అడిగితే “న‌న్నెవ‌రూ రికమెండ్ చేయ‌లేదు. నేనూ ఎవ‌రినీ చేయ‌లేదు. నిషా నా చెల్లెలే కావ‌చ్చు. కానీ అది ఇంటి వ‌ర‌కే. సినిమాల్లో అవ‌కాశాలు వ్యక్తిగ‌త ప్రతిభ వ‌ల్లే వ‌స్తాయి. ఒక వేళ రిక‌మెండేష‌న్లు నిజ‌మైతే ఈపాటికి నిషా చాలా సినిమాల్లో న‌టించాలి క‌దా?“ అని ప్రశ్నిస్తోంది.

Exit mobile version