Site icon TeluguMirchi.com

పాపం నీకే ఇలా జరుగుతుందేంటి తమన్నా?

మిల్కీబ్యూటి తమన్నా స్టార్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ‘బాహుబలి’ అవకాశం వచ్చింది. ఈ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించిన తమన్నాకు పెద్దగా హిట్‌లేమి పడలేదు. ఇకపోతే ‘బాహుబలి ’ మొదటి పార్టులో తమన్నా పాత్ర బాగానే ఉన్నా కూడా రెండో పార్టులో మాత్రం ఏం లేదు. ‘బాహుబలి 2’ చిత్రం తమన్నా అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ చిత్రం తర్వాత తమన్నాకు చెప్పుకోదగ్గ అవకాశాలేవి రావడం లేదు. అంతేకాకుండా ‘బాహుబలి’ రెండో పార్టు వల్ల తమన్నాకు పెద్దగా ఒరిగిందేం లేదు.

మంచి నటన, అందం ఉండి అందాల ఆరబోతకు వెనుకాడకున్నా కూడా తమన్నాకు అవకాశాలు కరువయ్యాయి. ఈ అమ్మడికి తెలుగులో ఒక్క అవకాశం లేకపోగా తమిళంలో కేవలం ఒకే ఒక అవకాశం వచ్చింది. తెలుగులో ఎన్టీఆర్‌ అవకాశం వచ్చినట్టే వచ్చి ఎగిరిపోయింది. ప్రభాస్‌ ‘సాహో’ చిత్రంలో కూడా తమన్నా హీరోయిన్‌ అనుకున్నారు కానీ అదంతా పుకారే అని యూనిట్‌ కొట్టిపారేశారు. అవకాశాలే రావడం లేదు, వచ్చిన అవకాశాలు కూడా ఎగిరిపోతున్నాయి. ఎంత అందం ఉండి ఏం లాభం పాపం.. తమన్నా నీకే ఇలా జరుగుతుంది ఏంటి అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Exit mobile version