తాజాగా విడుదలైన ‘శివలింగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సినిమా టాక్ గురించి కాకుండా తన అందాల గురించే ఎక్కువగా మాట్లాడుకునేలా అందాలను ఆనబోసింది హాట్ భామ రితికా సింగ్. తాజాగా మీడియాతో ముచ్చటించిన రితికా సింగ్ సినిమాలో చాలా గ్లామర్‌గా కనిపించారుగా అని అడగగానే అలా అవసరం కాబట్టి చూపించాను అంటూ చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది.
అంతేకాకుండా అవసరం ఉన్న చోట అందాలను అడ్డు అదుపు లేకుండా ఆరబోయడానికి సైతం తాను సిద్దంగా ఉన్నట్టు పరోక్షంగా అర్థమయ్యేలా చెప్పింది. ఈ అమ్మడి గ్లామర్ షో సినిమాలోనే కాకుండా బయట కూడా పిచ్చెక్కించేలాగే ఉంది.అంత గ్లామర్‌గా నటించారు ఏం అనిపించలేదా అని అడగగా నాకు సిగ్గు లేదు, ఎక్కడైనా ఒకేలాగ ఉంటాను.
అవసరం మేరకు అందాలను ఆరబోస్తాను, అందాల విషయంలో షరతులు ఏం లేవు అని గ్లామర్ పాత్రల కోసం ఎప్పుడు రెడీనే అంటూ తదుపరి అవకాశాల కోసం ఈ అమ్మడు గాలం వేసేలా మాట్లాడుతోంది. అంతేకాకుండా పెళ్లయ్యాక కూడా నేను అస్సలే సిగ్గు పడను అంటూ గడుసుగా సమాధానమిస్తోంది రితికా. గ్లామర్ పాత్రలకే పెద్ద పీఠ వేస్తాను అనగానే ఈ అమ్మడికి కొత్త అవకాశాలు బాగానే అందుతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.