హ‌రీష్ ఇక మారడ‌ట‌!

harishహిట్టొచ్చినా, సినిమా ఫ్లాప్ అయినా – ఎవ‌రేమ‌నుకొన్నా, త‌న‌ని ప‌ట్టించుకొన్నా లేకున్నా ఒకేలా ఉంటాడు హరీష్ శంక‌ర్. అదే దూకుడు, అదే ధైర్యం. మీడియాపై సెటైర్లు వేయ‌డానికి కూడా వెనుకాడ‌ని నైజం. ట్విట్టర్‌లో కాస్త ఘూటుగా కామెంట్ పెడితే అంత‌కంటే నాటుగా స‌మాధానం ఇస్తారాయ‌న‌. నేనింతే ఇలాగే ఉంటా ఎవ‌రి కోసం నా ప‌ద్దతిని మార్చుకోను అని చెబుతున్నాడు హ‌రీష్. ”మీడియాపై కామెంట్ చేసిన మాట వాస్తవ‌మే. అయితే అది ఒక‌రిద్దరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. అంద‌రికీ అన్వయించుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేదు” అని వివ‌ర‌ణ ఇచ్చాడు. ”అన్ని వృత్తుల్లోనూ చెడ్డవాళ్లు ఉంటారు. అలాగ‌ని ఆ వృత్తిని త‌ప్పుప‌ట్టవ‌ల‌సిన అవ‌స‌రం లేదు. మీడియా అంటే నాకు గౌరవం ఉంది. అది చాలా గొప్ప వృత్తి” అని కితాబిచ్చాడు హ‌రీష్‌.