నో డౌట్..మహేష్ టైం లో మార్పులేదు

mahesh oneమహేష్ ‘వన్’ నేనొక్కడినే’ చిత్రం విడుదల తేది పై అనుమానాలు వున్నట్లు గత కొద్ది రోజులు కొన్ని వార్తలు హాల్ చల్ చేశాయి. ‘జనవరి 10 కి ‘వన్’ వచ్చేది డౌటే..! అంటూ వినిపించింది. ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్షన్ పనుల్లో జాప్యం జరుగుతోందని, అందుకే మొదట అనుకున్న తేది జనవరి 10 కి చిత్రం రాలేకపోవచ్చని వార్తలు వచ్చాయి. అయితే ‘వన్’ ప్రొడక్షన్ టీం ఈ చిత్రం విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ”వన్’ జనవరి 10 న వచ్చేది ఖాయం. ఇందుకు సంభందించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ కాపీ కూడా రెడీ అయ్యింది. సోమవారం సెన్సార్ జరగనుందంటూ ‘వన్’ విడుదల డౌట్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.