ఎన్టీఆర్ షో కు డేట్స్ లేవన్న యాంకర్..

వెండి తెర ఫై యాంగ్ టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్ , ఇప్పుడు బుల్లితెర ఫై బిగ్ బాస్ అనిపించుకోవడానికి రెడీ అవుతున్న సంగతి తెల్సిందే. హిందీ లో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో ను , ఇప్పుడు తెలుగు లో మా టీవీ వారు మొదలు పెట్టబోతున్నారు. దీనికి హోస్ట్ గా ఎన్టీఆర్ చేయబోతున్న సంగతి తెల్సిందే..

త్వరలో ప్రారంభంకానున్న ఈ తెలుగు షోలో పాల్గొనేందుకు స్టార్ యాంకర్ సుమను సంప్రదించారట. కానీ సుమ ఈ ఆఫర్ ను తిరస్కరించించారట. వరుస టీవీ షోలతో, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండటమే ఈమె తిరస్కారానికి కారణమని అంటున్నారు.. ఎందుకంటే బిగ్ బాస్ షో అంటే ఒకటి రెండు రోజుల్లో ముగిసేది కాదు. దానికి ఎక్కువ సమయమే కేటాయించాల్సి ఉంటుంది. దాని వలన ఇంతకు ముందే డేట్స్ ఇచ్చిన ఇతర షోలకు ఇబ్బంది వస్తుందని సుమ ఎన్టీఆర్ ఆఫర్ ను కాదన్నదని మాట్లాడుకుంటున్నారు. అలాగే స్టార్ నటుడు పోసానిని కూడా షో నిర్వాహకులు సంప్రదించారట. మరి పోసాని ఓకే చెప్పాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.