కేసూ లేదు… గీసూ లేదు

Ram-Charan.jpgఅనుకొన్నట్టే జ‌రిగింది. మ‌గ‌ధీరుడు త‌న ప‌లుకుబ‌డితో కేసు లేకుండా బ‌య‌ట‌ప‌డ్డాడు. న‌డిరోడ్డు పై ఇద్దరు సాఫ్ట్‌ వేర్ ఉద్యోగుల‌పై త‌న సిబ్బందితో దాడి చేయించిన రామ్‌ చ‌ర‌ణ్ – రెండో రోజే విముక్తుడ‌య్యాడు. చ‌ర‌ణ్ మాపై దాడి చేశాడంటూ ఇద్దరు వ్యక్తులు పంజా గుట్టా పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కారు. దాంతో.. యంత్రాంగం క‌దిలింది. అంద‌రూ చ‌ర‌ణ్‌ కి వ‌కాల్తా పాడేవాళ్లే. చ‌ర‌ణ్ కొట్టలేదుగానీ.. ఆయ‌న మ‌నుషులు మాత్రం మాపై దాడి చేశారు.. అని బాధితులు ఎంత మొత్తుకొన్నా – ఫ‌లితం లేక‌పోయింది. చ‌ర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులూ వెర‌శి – కేసూ గీసూ లేకుండా…. క‌నీసం క్షమాప‌ణ‌లు కూడా చెప్పకుండా చ‌ర‌ణ్ ఈ ఘ‌ట‌న నుంచి ద‌ర్జాగా బ‌య‌ట ప‌డ్డాడు. రోడ్డుమీద చేత్తో కొట్టిన చ‌ర‌ణ్‌… పోలీసు స్టేష‌న్ లో నోట్లతో కొట్టాడేమో… అందుకే కేసులేకుండా బ‌య‌ట ప‌డ్డాడు అంటూ ఫిల్మ్‌న‌గ‌ర్ గుస‌గుస‌లాడుకొంటోంది. మెగాస్టార్ కొడుకా.. మ‌జాకా!