బ్యాడ్ న్యూస్ : నో బెనిఫిట్ షోస్…

Umar-review-baahubaliఅగ్ర హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే..రిలీజ్ కు ముందు రోజు రాత్రే బెనిఫిట్ షోస్ తో అభిమానులు సందడి చేస్తుంటారు..తెలంగాణ లో బెనిఫిట్ షోస్ తక్కువే కానీ ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు, పాలకొల్లు, వైజాగ్ వంటి నగరాల్లో ఎక్కువగా బెనిఫిట్ షోస్ వేస్తుంటారు..ఇక షోస్ రేట్లు కూడా ఆకాశానికి తాకుతాయి..రూ. 200 నుండి కనీసం 1500 వరకు ఉంటాయి..ఇప్పుడు భారీ అంచనాలు మధ్య రిలీజ్ కాబోతున్న బాహుబలి 2 కు సైతం మూడు వేల వరకు పలుకుతుంది..అయితే తెలంగాణ లో మాత్రం బెనిఫిట్ షోస్ కు పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తుంది.

ఇప్పటికే రోజుకు నాల్గు షోస్ వేసే థియేటర్స్ కు అదనంగా మరో షో వేయడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది..అంటే ఉదయం 8 గంటలకే షోస్ మొదలు కానున్నాయి. ఈ నేపథ్యం లో మళ్లీ బెనిఫిట్ షోస్ అనవసరమని ప్రభుత్వం భావిస్తుంది. పవన్ నటించిన కాటమరాయుడు చిత్రానికి కూడా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వలేదనే సంగతి తెల్సిందే. బాహుబలి 2 ను ముందే చూడాలనుకునే వారు కూడా ఉదయం 8 గంటల షో తోనే చూడాలన్నమాట.