అల్లు అర్జున్‌తో ఆ చిత్రంలో నటించడంతో పాటు ఆయన తదుపరి చిత్రం ఐకాన్‌లో కూడా ఆమె ఓకే అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఒకేసారి రెండు సినిమాలు బన్నీతో చేసే అవకాశం దక్కడంతో పాతిక లక్షల లోపు ఉన్న ఈమె పారితోషికం ఏకంగా 75 లక్షలకు పెంచినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితో నటించేందుకు ఈమె ఆసక్తిగా ఉంది. తాజాగా ఒక యంగ్ హీరో చిత్రంలో నటించేందుకు ఈమెను సంప్రదించగా 20 నిమిషాల పాత్రకే ఏకంగా 75 లక్షలు డిమాండ్ చేసిందట. మరీ ఇంత డిమాండ్ చేస్తే వచ్చిన ఆఫర్లు చేజారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.