బన్నీ అవకాశం ఇవ్వగానే రేటు పెంచేసిందట

మెంటల్‌ మదిలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్‌. ఈ అమ్మడు కెరీర్‌ ఆరంభంలో కాస్త ఇబ్బంది పడ్డా ఈ ఏడాది రెండు మంచి సినిమాలు పడ్డాయి. ఆయా సినిమాల్లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించినప్పటికి ఆ సినిమాల సక్సెస్‌ కారణంగా మంచి డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో చిత్రంలో రెండవ హీరోయిన్‌గా ఈమె నటిస్తున్న విషయం తెల్సిందే.

అల్లు అర్జున్‌తో ఆ చిత్రంలో నటించడంతో పాటు ఆయన తదుపరి చిత్రం ఐకాన్‌లో కూడా ఆమె ఓకే అయ్యిందని వార్తలు వస్తున్నాయి. ఒకేసారి రెండు సినిమాలు బన్నీతో చేసే అవకాశం దక్కడంతో పాతిక లక్షల లోపు ఉన్న ఈమె పారితోషికం ఏకంగా 75 లక్షలకు పెంచినట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా లేకుండా అందరితో నటించేందుకు ఈమె ఆసక్తిగా ఉంది. తాజాగా ఒక యంగ్‌ హీరో చిత్రంలో నటించేందుకు ఈమెను సంప్రదించగా 20 నిమిషాల పాత్రకే ఏకంగా 75 లక్షలు డిమాండ్‌ చేసిందట. మరీ ఇంత డిమాండ్‌ చేస్తే వచ్చిన ఆఫర్లు చేజారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.