నిత్యా మీనన్ రహస్య ప్రేమాయణం బట్టబయలయ్యింది..

nityaతెలుగు, తమిళం , మలయాళం ఇలా అన్ని భాషల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్, కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ కి చెందిన హీరో తో ప్రేమాయణం సాగిస్తున్న సంగతి బయటపడింది. ఇందులో ఏముంది అనుకుంటున్నారా..ఆ హీరో కు ఆల్రెడీ పెళ్ళియ్యింది. అందుకే ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ఇంతకీ ఆ హీరో ఎవరో..? వీరి ప్రేమ ఎలా మొదలయ్యింది..? అనేది ఇప్పుడు చూద్దాం..

మలయాళం నటుడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ తో కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు కథనాలు వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు నిత్యా ప్రేమాయణం వల్ల దుల్కర్ ఇంట్లో రోజు గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. దుల్కర్ సల్మాన్ తో ఇప్పటికే మూడు సినిమాల్లో నిత్యా నటించింది. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమాయణం మొదలయ్యింది అనుకుంటున్నారు. ఈ వార్త తెలుసుకున్న ప్రేక్షకులు మాత్రం పెళ్లయిన హీరోతో ప్రేమ ఏంటి నిత్యా అని అంటున్నారు. మరి వీరి ప్రేమ ఎంత వరకు పోతుందో చూడాలి.