సంచలనాల చిత్రం రుద్రమదేవిలో స్టార్ కాస్ట్ రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ సినిమాలో ఒక్కో స్టార్ వచ్చి చేరుతున్నారు. అనుష్క, రానా, బాబా సెగహల్, నథాలియా కౌర్, హంసా నందిని – ఇలా తారల తళుకు బెళుకులు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయ్. తాజాగా ఈ జాబితాలో నిత్యమీనన్ కూడా చేరినట్టు సమాచారమ్. రుద్రమదేవిలో ఓ కీలక పాత్రలో నిత్య కనిపించబోతోంది. ఈ సినిమా చేయడానికి నిత్య ఒప్పుకొన్నట్టు సమాచారమ్. గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు. దాదాపు 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.