వరుసగా ఫ్లాప్‌లతో నితిన్ మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. చాలా నమ్మకంతో చేసిన శ్రీనివాస కళ్యాణం చిత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్న నితిన్ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంను ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నాడు. మొదటి సినిమాతో కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకున్న వెంకీ కుడుముల చాలా కాలం వెయిట్ చేసి మరీ ఈ చిత్రంను చేస్తున్నాడు.
దాదాపు ఏడాది కాలంగా ఈ చిత్రం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఏవో కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. మొదట షూటింగ్ ప్రారంభం అయిన సమయంలో సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావించారు. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సినిమా వచ్చే ఏడాది వరకు సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భీష్మ చిత్రంలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటిస్తోంది. ఆ కారణంగా సినిమాకు మంచి క్రేజ్ అయితే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.