మరో ప్రేమకథతో..

nithin’ఇష్క్’ తో ఫామ్ లోకి వచ్చాడు నితిన్. గుండెజారి గల్లంతయ్యిందే అని ప్రేక్షకులకు ’హార్ట్ ఎటాక్’ తెప్పించాడు. ఇప్పుడు మరో ప్రేమకథతో రాబోతున్నాడు. నితిన్ హీరోగా  శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. దర్శకుడు సురేంధర్ రెడ్డి శిష్యుడే శ్రీనివాస్ రెడ్డి. శ్రవణా మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్ లో సోమవారం లాంచనంగా ప్రారంభమైంది. దేవుని పటాలపై ఫస్ట్ షాట్ ని చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి నిర్మాత రామ్మోహన్ రావు క్లాప్ నివ్వగా, సదానంద గౌడ్ స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అన్నట్టు, మార్చి మూడో వారం నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.