నితిన్ కి ‘కిక్’ ఇస్తాడా

images‘ఇష్క్’ సినిమా విజయంతో హీరో నితిన్ తన జోరు పెంచాడు. ప్రస్తుతం నితిన్ గౌతమ్ మీనన్ ఫోటాన్‌ కథ బేనర్ పై ‘కొరియర్ బాయ్ కళ్యాన్’, శ్రేష్ట్ మూవీస్‌ బ్యానర్ పై ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలు చేస్తున్న ఈ హీరోకి మరో ఛాన్స్ లక్కి ఛాన్స్ తగిలింది. ‘అతనొక్కడే’, ‘అతిధి’, ‘అశోక్’, ‘కిక్’, ‘ఊసరవెల్లి’ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి రూపొందించబోతున్న సినిమాలో నితిన్ కు చాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన కథ కుడా రెడీ అయింది. సురేందర్ రెడ్డి ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రాన్ని చేసే సన్నాహాల్లో వున్నాడు. ఇది పూర్తయ్యాక నితిన్ తో చేసే ప్రాజక్ట్ సెట్స్ కి వెళుతుందని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.