Site icon TeluguMirchi.com

త‌మిళంలో నితిన్ సినిమా

nithinడ‌బ్బింగుల జోరు ఎక్కువైంది. ఇంత‌కాలం త‌మిళం నుంచి తెలుగులోకి వ‌చ్చిన సినిమాలే ఎక్కువ‌. ఇప్పుడు తెలుగు నుంచి త‌మిళంలోకి వెళ్తున్నాయి. ఆఖ‌రికి ఫ్లాప్ సినిమాల్నీ వ‌ద‌ల‌డం లేదు. నితిన్ – హ‌న్సిక జంట‌గా న‌టించిన సీతారాముల క‌ల్యాణం – లంక‌లో సినిమాని ఇప్పుడు త‌మిళంలోకి డ‌బ్ చేస్తున్నారు. రౌడీ క‌ట్టయ్ పేరుతో. నితిన్‌ కి త‌మిళంలో మార్కెట్ లేక‌పోయినా, హ‌న్సిక అంటే బోలెడంత క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకోవాల‌నే ఈ సినిమాని త‌మిళంలోకి తీసుకెళ్తున్నార‌ట‌. ఈ సినిమా కాస్తో, కూస్తో వ‌సూళ్లు సంపాదించుకొంటే హ‌న్సిక న‌టించిన మ‌రిన్ని సినిమాలు డ‌బ్ అవ్వడం ఖాయం.

Exit mobile version