Site icon TeluguMirchi.com

మాంచి లవ్ స్టొరీ తో రెడీ అయ్యారు !

nithinఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే వంటి రెండు వరుస విజయాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చేశాడు నితిన్ . ఇప్పుడు “హార్ట్ అటాక్” ను విడుదలకు సిద్దంగా వుంచి, మరో సూపర్ లవ్ స్టోరి చేయడానికి రెడీ అయ్యాడు. దర్శకుడు కరుణాకరణ్ తో నితిన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రం ఫ్లాపయిన తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న కరుణాకరణ్, నితిన్ కోసం ఓ ట్రెండ్ సెట్టింగ్ ప్రేమ కధ రెడీ చేసాడట. జనవరి లో షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై విక్రం గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

Exit mobile version