నితిన్ ‘కల’నేరవేరింది..

nithin22టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కల నెరవేరబోతుంది..టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్స్ రాజమౌళి , వివి వినాయక్, పూరి జగన్నాధ్ వంటి అగ్ర దర్శకులతో నటించి సక్సెస్ కొట్టిన కానీ అతడి కల మాత్రం కల గానే మిగిలిపోయిందట..తాజాగా త్రివిక్రమ్ దయ వల్ల ఆ కల తీర్చుకోగాలిగాడు..ఇంతకి ఆ కల ఏంటి అంటే ’50 కోట్ల క్లబ్ ‘..

నితిన్ ఇన్ని చిత్రాలలో నటించినప్పటికీ ఓవర్సీస్ లో సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయాడట, అంతే కాకుండా 50 కోట్ల క్లబ్ లో కూడా చేరలేకపోయాడట..కానీ అ..ఆ చిత్ర సక్సెస్ తో నితిన్ కు మంచి గుర్తింపే కాకుండా అతడి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు..ఇప్పటికే 32 కోట్ల వసూళ్ళ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది..మరో మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ లో చేరిపోవడం ఖాయమని చెప్పనవసరం లేదు..మొత్తాన్ని అ..ఆ..అతడి జాతకం మార్చింది.