Site icon TeluguMirchi.com

కేటీఆర్ కోసం హీరో నితిన్ ఏంచేసాడో తెలుసా..?

కేటీఆర్ అంటే కేవలం రాజకీయ నేతలకు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు సైతం చాల ఇష్టమైన వ్యక్తి. రాజకీయాలతో ఎంత బిజీ గా ఉన్న కానీ సినీ ఫంక్షన్లకు హాజరు కావడం..సినిమాలు చూడడం దానిపై స్పందించడం చేస్తూ హీరోల అభిమానులు సైతం ఆకట్టుకుంటారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు ఈ సందర్బంగా పుట్టిన రోజు కోసం అనవసర ఖర్చులు చేయకుండా..ఆ చేసేదేమైనా సమాజానికి ఉపయోగపడేలా చేయండి అంటూ పిలుపు ఇచ్చాడు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ కార్య కర్తలు పలు సేవ కార్య క్రమాలు చేయడం..మొక్కలు నాటడం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హీరో నితిన్ తెరాస రాజ్యసభ సభ్యుడైన సంతోష్ కుమార్ స్పూర్తితో మొక్కలు నాటి, ఇలాంటి సామజిక బాధ్యతలో భాగస్థుడిని చేసినందుకు కృతఙ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. నితిన్ ప్రస్తుతం రంగ్ దే, బీష్మ చిత్రాలతో పాటు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.

Exit mobile version