Site icon TeluguMirchi.com

‘కొరియర్ బాయ్’ వెనక్కి వెళ్ళాడు

courier-boy-kalyanగుండెజారి గల్లంతయ్యిందే’ చిత్రం తర్వాత నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. యామి గౌతమ్ హీరోయిన్. ప్రేమ్ సాయి దర్శకుడు. ఫోటాన్ కథాస్ పతాకంపై గౌతం వాసుదేవమీనన్ నిర్మిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన కొరియర్ బాయ్ కళ్యాణ్ ఈ ఏడాదికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ చిత్ర తమిళ వెర్షన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో ఈ సినిమా విడుదలను 2014 జనవరికి వాయిదా వేసినట్టు సమాచారం. మరో వైపు నితిన్, పూరి కాంబినేషన్ లో సెట్స్ పైవున్న ‘హార్ట్ ఎటాక్’ కూడా 2014 సంక్రాంతి బరిలో వుంది. అన్ని కుదిరితే ఓ 15రోజుల గ్యాప్ లోనే ఈ రెండు చిత్రాలు తెరపై సందడి చేసే అవకాశం వుంది.

Exit mobile version