Site icon TeluguMirchi.com

నిఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన తండ్రి

క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు, న‌టుడు నిఖిల్ కుమార‌స్వామి ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. జాగ్వార్ అనే సినిమాతో నటుడిగా మారిన నిఖిల్.. ఆ సినిమా క‌న్న‌డ‌తో పాటు తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ అయినప్పటికీ పెద్దగా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత క‌న్న‌డ‌లో ఒక‌టీ అర సినిమాలు చేసిన నిఖిల్..ప్రస్తుతం పెళ్లి కి సిద్దమయ్యాడు. రేవతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఈ మధ్యనే నగరంలోని తాజ్‌ వెస్టెండ్‌ హోటల్లో నిఖిల్, రేవతి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ ఎక్కువగా ఉండడం తో అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ నడుస్తుంది. దీంతో చాలామంది తమ వివాహ వేడుకలను రద్దు చేసుకుంటున్నారు. టాలీవుడ్ సినీ హీరోస్ నిఖిల్ , నితిన్ లు సైతం ఏప్రిల్ నెలలో కావలసిన తమ మ్యారేజ్ లను పోస్ట్ పోన్ చేసుకున్నారు. కుమార‌స్వామి త‌న‌యుడు, న‌టుడు నిఖిల్ కూడా తన పెళ్లి ని వాయిదా వేసుకుంటాడు కావొచ్చని అంత అనుకున్నారు. కానీ నిఖిల్ పెళ్లి అనుకున్న టీమ్ కే జరపబోతున్నట్లు కుమార‌స్వామి తెలిపారు.

ఈ నెల 17న పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆరు నూరైనా అదే రోజు తన కొడుకు నిఖిల్ గౌడ పెళ్లి జరగనున్నట్టు ఆయన తండ్రి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కన్ఫామ్ చేసారు.

Exit mobile version