శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన నిఖిల్.. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’.. రీసెంట్గా ‘అర్జున్ సురవరం’ లాంటి హిట్ చిత్రాల్లో నటించిన నిఖిల్..తాను ప్రేమించిన అమ్మాయి డాక్టర్ పల్లవి ని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 01 కుటుంబ సభ్యుల సమక్షం లో ఎగజ్మెంట్ జరుగగా..ఏప్రిల్ 16న హైదరాబాద్ లో పెళ్లి చేయాలనీ ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పెళ్లి ని వాయిదా వేశారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తమ పెళ్లి జరగడం కష్టమని, అందుకే వాయిదా వేస్తున్నానని తాజాగా నిఖిల్ స్పష్టం చేశారు. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తానని చెప్పారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ నిర్మూలన కోసం పోరాడుతోన్న వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి నిఖిల్ అండగా నిలుస్తున్నారు. వారి కోసం ఖరీదైన పర్సనల్ ప్రొటక్షన్ కిట్స్‌ను అందిస్తున్నారు. ఇప్పటికే గాంధీ హాస్పిటల్ స్టాఫ్‌కు భారీగా ఎన్95 రెస్సిరేటర్లు, గ్లోవ్స్, ప్రొటక్షన్ గ్లాసెస్, శానిటైజర్లు, ఫేస్ మాస్క్‌లు అందజేశారు.