Site icon TeluguMirchi.com

నిఖిల్ పెళ్లి పై హీరోయిన్ ఫైర్

లాక్ డౌన్ సమయంలోనూ దేశంలో అక్కడక్కడా వివాహాలు జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ జాబితాలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ పెళ్లి కూడా చేరింది. అయితే ఈ సెలబ్రిటీ మ్యారేజి నిర్వహణపై వివాదం ముసురుకుంటోంది. నిఖిల్ వివాహం మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కృష్ణప్ప మనవరాలు రేవతితో కేతగనహళ్లి ఫార్మ్ హౌస్ లో జరిగింది. ఈ వేడుకకు మాజీ ప్రధాని దేవెగౌడ బంధువర్గం నుంచి 60 మంది, పెళ్లికూతురు తరఫు బంధువులు మరో 30 మంది వరకు విచ్చేశారు. అంతేకాదు, ఇరు కుటుంబాల సన్నిహితులు కూడా హాజరయ్యారు.

ఈ పెళ్లి బాలీవుడ్‌హీరోయిన్ రవీనా టాండన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ఈ సమయంలో వివాహ వేడుక నిర్వహించడం ఏంటని ప్రశ్నించింది. కరోనా సంక్షోభంలో పేదలు తమ కుటుంబ సభ్యులను చేరుకోలేకపోతున్నారని, ఆకలితో అలమటిస్తున్నారని , కానీ ధనికులు మాత్రం నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నారని ఫైర్ అయ్యింది.

Exit mobile version