Nikhil – Kavya : నిఖిల్ – కావ్య బ్రేకప్ ఫిక్స్? ఇన్ స్టా పోస్ట్ వైరల్


Nikhil – Kavya : ‘గోరింటాకు’ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ మళియక్కల్, ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో విజేతగా నిలిచి మరింత క్రేజ్ సంపాదించాడు. సీరియల్స్, షోల్లో నటిస్తూ ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్న నిఖిల్, గోరింటాకు సీరియల్ లో తనతో కలిసి నటించిన కావ్యతో ప్రేమలో ఉన్నాడని అందరికీ తెలుసు. వీరిద్దరూ కలిసి పలు టీవీ షోలలో జంటగా కనిపించడం, బయట కూడా క్లోజ్‌గా ఉండడం వంటివి అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. కానీ, బిగ్ బాస్ షో సమయంలో నిఖిల్ తన ప్రేమ విఫలమైందని చెప్పి ఎమోషనల్ అయ్యాడు. అయినప్పటికీ, తననే నా జీవిత భాగస్వామిగా కోరుకుంటున్నానని నిఖిల్ చెప్పడం, కానీ ఆమె స్పందించకపోవడం అభిమానుల హృదయాలను బాధించాయి. తాజాగా ‘చిన్ని’ సీరియల్‌లో ఇద్దరూ కలిసి కనిపించినా, ఆ రీయూనియన్ ఎంతో కాలం లేదు.

Also Read :  Single : 'సింగిల్' మూవీ ఇంటిళ్లపాదిని కడుపుబ్బా నవ్విస్తుంది : శ్రీ విష్ణు

Also Read : Erracheera : ‘ఎర్రచీర’.. కథ చెప్పండి, రూ.5 లక్షలు గెలవండి

అయితే వీరి ఫ్యాన్స్ ఈ ఇద్దర్ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిఖిల్ ఒక భావోద్వేగ పోస్ట్ చేసాడు. “మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ అందరి వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. కానీ నాదొక రిక్వెస్ట్. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నాము. కాబట్టి మమ్మల్ని వ్యక్తిగతంగానే సపోర్ట్ చేయండి, ప్రేమించండి. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీ అందర్నీ రిక్వెస్ట్ చేస్తున్నాను నన్ను ఎవరితోనూ ట్యాగ్ చేయకండి, వర్క్ విషయంలో కాకుండా వేరే ఏ పోస్ట్ లలోను నన్ను ఎవరితోనూ లింక్ చేయకండి, ట్యాగ్ చేయకండి. మీరు అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఐ లవ్యూ ఆల్” అని ఇన్ స్టా స్టోరీస్ లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నిఖిల్–కావ్య ఇక విడిపోయినట్లేనా? మరి దీనిపై కావ్య నుంచి స్పందన వస్తుందేమో చూడాలి.

Also Read :  HIT 3 : నాని హిట్3 కలెక్షన్ల తుపాను.. రెండు రోజుల్లో ₹62 కోట్లు!