Site icon TeluguMirchi.com

సింపుల్ గా నిఖిల్ పెళ్లి


కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంట్లో శుభ కార్యం జరిగింది. లాక్ డౌన్ నేపథ్యంలో రాంనగర్ జిల్లాలోని బిడాడీ ఫాంహౌస్లో నిరాడంబరంగా ఆయన కుమారుడి పెళ్లితంతును పూర్తి చేస్తున్నారు. పెళ్లిలో జరగాల్సిన సంప్రదాయ ఉత్సవాలన్నింటినీ రద్దుచేసి కేవలం ప్రధాన కార్యక్రమాలను మాత్రమే నిర్వహిస్తున్నారు.

కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడకు, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎం.క్రిష్ణప్ప మనుమరాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 17వ తేదీన జనపదలోకలో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలని అప్పుడే నిర్ణయించారు. కానీ లా డౌనను మే 3వ తేదీ వరకు పొడిగించడం, లాక్ డౌన్ నిబంధనల మేరకు భారీ ఫంక్షన్లకు అవకాశం లేకపోవడంతో పరిమిత సంఖ్యలో అతిథులతో ఫాంహౌస్లో పెళ్లి వేడుకను నిర్వహిస్తున్నారు.

Exit mobile version