Site icon TeluguMirchi.com

నిహారికకు పెళ్లిచూపులు..!

niharika-next-filmమెగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కు అప్పుడే పెళ్లి చూపులా..? ఇక సినిమాలు చేయదా..? అని ఖంగారు పడకండి. జస్ట్ మీము చెప్పేది సినిమా గురించి. ఇటీవల ఆమె దగ్గరికి పెళ్లి చూపులు కథ మాదిరే మరో కథను వినిపించారట. మొదటి ఈ సినిమా చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యిందట. కానీ ఇంతలో పెళ్లి చూపులు చిత్రాన్ని చూసి ఆమె విన్న కథ కూడా దాదాపు పెళ్లి చూపులు చిత్ర కథ మాదిరిగానే ఉండడం తో ఆ సినిమా చేయడం లేదని సదరు దర్శకులకు చెప్పిందట.

ఇప్పటికే మొదటి చిత్రం గట్టి దెబ్బ కొట్టడం తో నెక్స్ట్ చేయబోయే చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చాల జాగ్రత్తగా కథలను ఎంచుకుంటుంది. తనకు తగ్గట్టు కథ ఉంటేనే ఒకే చెపుతోందట. ప్రస్తుతం ఈమె కోసం మంచి లవ్ స్టోరీ లు రాసే పనిలో కథ రచయతలు ఉన్నారని సమాచారం.

Exit mobile version