Site icon TeluguMirchi.com

త్వరలోనే నిహారిక కు దెయ్యం పట్టబోతోంది..

nihaఒక మనసు తో అందరిని మనుషులను దోచుకోలేక పోయిన మెగా హీరోయిన్ నిహారిక, త్వరలోనే దెయ్యం గా మరి ప్రేక్షకుల హృదయాలను దోచుకోబోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హర్రర్ కథలు సూపర్ సక్సెస్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారిక కూడా తన రెండో సినిమా హర్రర్ కథ నే ఎంచుకుంది టాక్.

మరాఠిలో సూపర్ సక్సెస్ అయిన హ్యాపీజర్నీ అనే చిత్రాన్ని తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెక్కిన ఈ చిత్రం లో నిహారిక దెయ్యంగా నటించనుంది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబదించిన చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.

Exit mobile version