Site icon TeluguMirchi.com

నిహారిక ‘మ్యాడ్‌ హౌస్‌’ రాబోతుంది

మెగాడాటర్‌ నిహారిక హీరోయిన్‌గా ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌లతో తన సత్తా చాటుతోంది. హీరోయిన్‌ కంటే ఈ అమ్మడికి వెబ్‌ సిరీస్‌ల ద్వారానే మంచి గుర్తింపు లభిస్తోంది. అందుకే నిహారిక మరో వెబ్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తోంది. నిహారిక బ్యానర్‌ పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్‌పై ‘మ్యాడ్‌ హౌస్‌’ వెబ్‌ సిరీస్‌ని 100 ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా యూట్యూబ్‌లో విడుదల చేశారు.

ఈ వెబ్‌ సిరీస్‌ను మహేష్‌ ఉప్పల చిత్రీకరించనున్నారు. హీరో, హీరోయిన్లుగా సంతోష్‌, కృతి సింగ్‌లు కనిపించనున్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కూడా ఉంటుందట. రొమాంటిక్‌, కామెడీ డ్రామాగా ఈ వెబ్‌ సిరీస్‌ రానుంది. సినిమాల విషయంలో కంటే వెబ్‌ సిరీస్‌ల ద్వారా ఈ అమ్మడికి మంచి పేరుంది. కాబట్టి నిహారిక %మ్యాడ్‌ హౌస్‌’ కి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.

Exit mobile version