మెగా 151 మూవీ సైరా నరసింహారెడ్డి ట్రైలర్‌ను నిన్న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ట్రైలర్ గురించి రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తానికి సినిమాపై అంచనాలు మాత్రం బాగానే పెరిగాయి. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ చిత్రం రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అని అంతా నమ్మకంగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో మెగా డాటర్ నిహారిక ఒక పాత్రలో కనిపించబోతుందనే విషయం గత సంవత్సర కాలంగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఆ విషయమై క్లారిటీ వచ్చింది.
నిహారిక పాత్ర ఏంటీ అంటూ వస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చేసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సైరా నరసింహారెడ్డిలో నిహారిక గిరిజన యువతి పాత్రలో కనిపించబోతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో మహిళ సైనికురాలిగా నిహారిక కనిపించబోతుంది. యుద్ద సన్నివేశాలు మరియు కొన్ని సీన్స్‌లో కూడా నిహారిక కనిపించబోతుంది. అక్టోబర్ 2న విడుదల కాబోతున్న ఈ చిత్రంతో నిహారిక నటిగా ఏ మేరకు సక్సెస్‌ను దక్కించుకుంటుందనేది చూడాలి.