పెళ్లి మాట ఎత్తగానే కొట్టేంత పనిచేసిన నిహారిక..

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక..ఒక మనసు మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ మూవీ ఆశించిన విజయం సాదించిక పోవడం తో రెండో మూవీ విషయం లో కాస్త ఆలోచనలో పడింది. ప్రస్తుతం హ్యాపీ వెడ్డింగ్ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యం లో ఈ చిత్ర ప్రమోషన్లను చాల వినూత్నగా ట్రై చేస్తున్నారు.

తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశారు. ఇందులో నిహారికని ఓ వ్యక్తి మీ వెడ్డింగ్ గురించి వార్త‌ ఓ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దీనిపై ఏమంటారు అని అడ‌గ‌గా, నా పెళ్లి గురించి మీ కెందుకు అని ఫైర్ అవుతుంది. నేన‌డిగింది హ్యాపీ వెడ్డింగ్ గురించి అని స‌ద‌రు వ్య‌క్తి చెప్ప‌గానే, కొంచెం కూల్ అయిన నిహారిక‌ త‌న తాజా చిత్ర ట్రైలర్ జూన్ 30 ఉద‌యం 10.35ని.ల‌కు విడుద‌ల కానుంద‌ని తెలియ‌జేసింది. ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియా లో మంచి స్పందన వస్తుంది.

సుమంత్ అశ్విన్‌, నిహారిక జంటగా తెరకెక్కిన ఈ మూవీ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కింది. పల్లెటూరు… ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించారు.