‘ హైవే ‘ ఫై త్రిష కష్టాలు…

Trisha-Drinkingటైటిల్ చూసి హైవే ఫై త్రిష కష్టాలు పడడం ఏంటి..అసలు ఏం జరిగిందో అని ఆశ్ఛర్య పోతున్నారా..? అయితే అసలు స్టోరీ చూస్తే ఆ కష్టాలు ఏంటో మీకే తెలుస్తాయి..

బాలీవుడ్ లో అనుష్క శర్మ నటించిన ‘ఎన్.హెచ్.10’ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు సాగే జాతీయ రహదారి అయిన ‘ఎన్.హెచ్.10’ పై జరిగే ప్రయాణంలో అనుష్క పడిన కష్టాలు ఏంటి అనే అంశాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ గా ఈ బాలీవుడ్ చిత్రం తెరకెక్కింది.

కాగా ఈ రీమేక్ లో త్రిష నటిస్తుందని సమాచారం. అంతే కాదు ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘గర్జనై’ అనే తమిళ చిత్ర టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. మరి త్రిష హైవే ఫై ఎలాంటి కష్టాలు పడుతుంది..చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.