Site icon TeluguMirchi.com

ఎన్జికె లేపేస్తున్నారు..

సూర్య – రకుల్ ప్రీతి సింగ్ – సాయి పల్లవి జంటగా సెల్వ రాఘవ దర్శకత్వంలో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్జికె చిత్రం ఫైనల్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సూర్య కు ఈ సినిమా బాగా కలిసొస్తుందని అంత ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా మొదటి రోజు మొదటి షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకొని రెండు రోజుల్లో థియేటర్స్ నుండి బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది. వీకెండ్ లో కూడా సరైన కలెక్షన్లు రాకపోవడం తో సోమవారం చాలా చోట్ల అడిషనల్ స్క్రీన్స్ లో తీసేసేందుకు ఇప్పటికే ఎగ్జిబిటర్లు రెడీగా ఉన్నారు.

వాస్తవానికి ఎన్జికె చిత్రానికి పోటీగా ఏ సినిమా పెద్దగా లేనప్పటికీ సినిమాలో కథ లేకపోవడం వల్లే ఆ స్థాయి వసూళ్లు కూడా రాబట్టలేకపోతుంది. చాలా చోట్ల మార్నింగ్ షో నిండటం కష్టమైపోయింది. ఓవరాల్ గా తెలుగు , తమిళ్ డిస్ట్రబ్యూటర్స్ కు ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది.

Exit mobile version