Site icon TeluguMirchi.com

కాలాకు కొత్త కష్టం

సూపర్ స్టార్ రజనీ కాంత్ “కాలా” రెగ్యులర్ షూటింగ్ ముంబయిలో మొదలైంది. షూటింగ్ కు ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన యూనిట్.. షూటింగ్ మొదలైన మొదటి రోజు కూడా అదే ఊపు కొనసాగిస్తోంది. ఐతే ఈ సినిమా చుట్టూ వివాదాలు కూడా అంతే జోరుగా వస్తున్నాయి.

ముంబయి మాఫియా బ్యాక్ గ్రౌండ్ తో కాలా సినిమా తీస్తున్నారు. ఒకనాటి డాన్ హాజీ మస్తాన్ జీవితగాథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని తొలుత ప్రచారం జరిగింది. దీనిపై హాజీమస్తాన్ దత్తపుత్రుడుగా చెప్పుకొంటున్న సుందర్ షకీర్ ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రజనీకాంత్ కు నోటీసు పంపించాడు.

తాజాగా చెన్నైకు చెందిన ప్రొడ్యూసర్ కె.రాజశేఖరన్ కాలా కరికాలన్ టైటిల్ కథ తనదని… వెంటనే రజనీకాంత్ సినిమా షూటింగ్ నిలిపివేయించాలని కోర్టులో పిటీషన్ వేశాడు. మరి ఇది ఏమౌతుందో చూడాలి.

Exit mobile version