Site icon TeluguMirchi.com

సామ్రాట్ ఖాయం చేశారా?

balakrishnaనంద‌మూరి బాల‌కృష్ణ సినిమా కోసం మ‌రో టైటిల్‌.. న‌లుగుతోంది. రూల‌ర్‌, జ‌య‌సింహా టైటిళ్లను పక్కన పెట్టిన బోయ‌పాటి శ్రీ‌ను.. ఇప్పుడు మ‌రో టైటిల్‌ని తెర‌పైకి తీసుకొచ్చాడు. అదే సామ్రాట్‌! గ‌త కొన్ని రోజులుల‌గా ఈ టైటిల్‌పై చిత్రబృందం దృష్టి సారించిన‌ట్టు తెలుస్తోంది. వ‌ర్కింగ్ టైటిల్‌గా సామ్రాట్‌నే అనుకొంటున్నారు. ఈ టైటిల్ బాల‌య్య కు అత్యంత స‌న్నిహితుడిగా ఉండే ఓ నిర్మాత పేరుమీద రిజిస్టర్ చేయించారు. ద‌స‌రా రోజున ఈ టైటిల్‌ని అధికారికంగా ప్రక‌టిస్తే బాగుంటుంద‌ని చిత్రబృందం భావిస్తోంది. ఫ్యాన్స్‌కి న‌చ్చతుందా? లేదా? అనే విష‌యాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ఇంత‌కీ బాల‌య్య ఫ్యాన్స్ మాటేంటి? రూల‌ర్‌, జ‌య‌సింహా, సామ్రాట్ – వీటిలో మీకు న‌చ్చిన‌దేమిటి?? నంద‌మూరి బాల‌య్య ఫ్యాన్స్ ఏ టైటిల్‌కి ఓటేస్తారు..? మీ అభిప్రాయాన్ని తెలుగు మిర్చికి తెలియ‌జేయండి.

Exit mobile version