Site icon TeluguMirchi.com

‘ భరత్ అనే నేను ‘ లో కొత్త సీన్స్

మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను.. గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కి ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతుండడం తో చిత్ర యూనిట్ సినిమాలో కొత్త సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారు.

సినిమా రన్ టైం లో భాగంగా తొలిగించిన ఆ సన్నివేశాలను త్వరలో జత చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం ఆ సన్నివేశాల తాలూకా డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేశారట. ఆ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా ఉండబోతున్నాయని అంటున్నారు. గతం లో కొరటాల తెరకెక్కించిన మిర్చి , జనతా గ్యారేజ్ చిత్రాల విషయంలోనూ ఇలాగే సినిమా రిలీజ్ తర్వాత కొత్త సన్నివేశాలను జత చేసి , సినిమా కలెక్షన్ల ను పెంచడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్దతిలో చేయబోతున్నారు. డివివి దానయ్య నిర్మాణం లో తెరకెక్కిన ఈ మూవీ లో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.

Exit mobile version