ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు.. సంక్రాంతి సినిమాలన్నీ ఒకేసారి


వీక్షకుల ఆదరణ బాగా ఉండడంతో ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది. ఆసక్తికర కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను రెడీ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమవుతున్నారు. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు ఆసక్తికర సినిమాలు విడుదల కానున్నాయి. ఈ వారం థియేటర్లో కంటే ఓటీటీలోనే ఎక్కువ సందడి కనిపించబోతోంది. ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాలన్నీ ఒకే సారి రాబోతోన్నాయి. సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ సినిమాలన్నీ కూడా ఇప్పుడు ఓటీటీలో పోటి పడేందుకు రెడీగా ఉన్నాయి. ఆ సినిమాలేవో ఒకసారి చూద్దాం రండి.

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు:
ఫిబ్రవరి 22 – వారసుడు – అమెజాన్ ప్రైమ్‌ వీడియో
ఫిబ్రవరి 23 – వీరసింహారెడ్డి – డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌
ఫిబ్రవరి 24 – మైఖేల్ – ఆహా
ఫిబ్రవరి 27 – వాల్తేరు వీరయ్య – నెట్‌ఫ్లిక్స్‌