Site icon TeluguMirchi.com

మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్

chran

మెగా ఫ్యామిలీలోకి మరో ఒకరు చేరారు. అది ఎవరో కాదు గుర్రం పిల్ల. మా ఫ్యామిలీలోకి అందమైన గుర్రం పిల్ల చేరిందంటూ రాంచరణ్ భార్య ఉపాసన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గుర్రం పిల్లతో ఆడుతున్న చెర్రీ ఫొటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది ఉపాసన.

ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్న స్నాగతి తెలిసిందే. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. పల్లెటూరి నేపధ్యంలో సాగే కధ ఇది. . విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమా కోసం ‘రేపల్లె’.. ‘పల్లెటూరి మొనగాడు’ ‘మొగల్తూరు మొనగాడు’ అనే పేర్లు పరిశీలనలో వున్నాయి. ఇందులో సమంత ఇందులో కథానాయిక. చరణ్ తో సమంత జతకట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version