Site icon TeluguMirchi.com

24/7 ఒకటే ధ్యాస..?


‘స్వాతిముత్యం’ సినిమా తో సక్సెస్ ఫుల్ గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ‘నేను స్టూడెంట్ సార్’ తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ఎస్వీ 2 ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పై ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీజర్‌ సినిమా పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది. నేడు ’24/7 ఒకటే ధ్యాస..’ సాంగ్ ను రామానాయుడు ప్రివ్యూ థియేటర్లో యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు.

24/7 Okate Dhyaasa Lyrical Song | Nenu Student Sir | Bellamkonda Ganesh,Avantika |Mahati Swara Sagar

అనంతరం యంగ్‌ ఎనర్జిటిక్‌ హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ.. నేను రోజూ స్టూడెంట్‌ గానే ఫీలవుతాను. ఈ టైటిల్‌ విన్నప్పుడు కాలేజీ రోజులు గుర్తుకు వచ్చేవి. ఏదైనా తింగరి పని చేసి పోలీసులకు దొరికినప్పుడు నేను స్టూడెంట్‌ సార్‌ అనేవాడిని. టీజర్‌ చాలా ప్రామిసింగ్‌ గా వుంది. నిన్న నాంది సతీష్‌గారు వచ్చి ఆహ్వానించారు. ఆయన చెప్పిన కంటెంట్‌ నచ్చింది. నేనూ పార్ట్‌ కావాలని ఈరోజు వచ్చాను. ఇంకో కారణం బెల్లంకొండ గణేష్‌. మేమిద్దం జుంబా క్లాస్‌ కు వెళ్ళే వాళ్ళం. ఆ తర్వాత జిమ్‌ లో కలిశాం. గణేష్ కాంటెంపరరీ కథల తో వస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌. రచయిత కృష్ణ చైతన్య కూడా దర్శకత్వం చేస్తున్నాడు. ఇందులో పాట రాసిన హర్ష కూడా మా సినిమాలో లవ్‌ సాంగ్‌ రాశాడు. సాగర్‌ అమేజింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చాడు. యూనిట్‌ కు ఆల్‌ ది బెస్ట్‌ అన్నారు.

బెల్లంకొండ గణేష్‌ మాట్లాడుతూ, ఈరోజు సాంగ్‌ చూశారు. ఫోన్‌ కొనడానికి కష్టపడుతూండగా వచ్చే మోన్‌ టేజ్‌ సాంగ్‌ ఇది. చాలా ఎంజాయ్‌ చేసేలా వుంటుంది. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని సినిమాలు చేసే విశ్వక్‌ అంటే ఇష్టం. తన నుంచి చాలా నేర్చుకోవాలి. పదేళ్ళనాడు తనను కలిసినప్పుడు చాలా క్లాస్‌ గా వుండేవాడు. అలాంటిది దాస్‌ కా మాస్‌ అంటూ మారిపోయాడు. జూన్‌ 2న మా సినిమా విడుదలవుతుంది. తప్పకుండా చూడండి అని అన్నారు.

Exit mobile version