నవంబర్ 8న నేనేం చిన్నపిల్లనా??

nenm‘అందాల రాక్షసి’ఫేం రాహుల్‌, తన్వి వ్యాస్‌ జంటగా రూపొందిన చిత్రం ‘నేనేం..చిన్నపిల్లనా.. ?’. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. రామానాయుడు నిర్మిస్తున్నారు. ‘రొమాంటిక్ క్రైమ్ కథ చిత్ర’ దర్శకుడు పి.సునీల్‌కుమార్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 8న విడుదలకు సిద్ధమయ్యింది. ఓ గ్రామం నుండి పట్టణానికి బయలుదేరిన అమ్మాయి కెరీర్ పరంగా తనను తాను ఎలా మలచుకుందనే కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించామని యూనిట్ చెబుతోంది. ఎం.ఎం శ్రీలేఖ మ్యూజిక్ అందించారు.