రానా తాజా సినిమా నేనే రాజు నేనే మంత్రి. తేజ దర్శకత్వం. రానా సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న విషయం విదితమే. ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న సినిమా . తాజాగా ఈ సినిమా టీజర్ వచ్చింది.
సెల్లోంచి బయటకొస్తున్నాడు ముసుగేసుకున్న హీరో. గొలుసులతో బంధించేసిన హీరో, ఉరికంబం దగ్గరకొస్తాడు. . చేతిలో సిగరెట్. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతకు ముందు వరకూ ‘పుట్టినవాడు మరణించక తప్పదు.. మరణించినవాడు మళ్ళీ జన్మించక తప్పదు..’ అంటూ పోసాని కృష్ణమురళి వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత, ‘నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా.. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా.. నా జీవితానికి నేనే రాజు నేనే మంత్రి’ అంటూ రాణా డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో విన్పిస్తుంది. ఇదీ టీజర్ లో కనిపించిన కంటెంట్. ఈ టీజర్ లో రాణా లుంగీ లుక్‌తో పక్కా మాస్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. మొత్తానికి టీజర్ ఆసక్తిని రేపింది.