దసరాకి బాలయ్య ఆయుధపూజ..


నందమూరి నటసింహం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘NBK 108’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని చెప్పారు మేక‌ర్స్. దసరా కానుకగా బాలయ్య సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. ‘విజయదశమికి ఆయుధపూజ’ అంటూ పోస్టర్‌ ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఇక బాలయ్య ఉగ్రరూపంలో ఉన్నట్లు కనిపిస్తున్న ఈ పోస్టర్ లో అమ్మవారు కూడా వున్నారు. ఎస్‌ ఎస్‌ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.