కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటి తమ గొప్ప మనసు చాటుకోగా..తాజాగా ఆ లిస్ట్ లో లేడి సూపర్ స్టార్ నయనతార చేరింది.
నయనతార తన వంతు బాధ్యతగా ఫెఫ్సీ (ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా)కు రూ.20 లక్షల విరాళం ప్రకటించింది. అంతేకాక కరోనాని జయించేందుకు ప్రతి ఒక్కరు ఇళ్లల్లోనే ఉండాలని కోరింది.