అందాలతార నయనతార హీరోయిన్‌గా తమిళంలో ఓ రేంజ్‌లో వెలుగు వెలుగుతోంది. ఈ అమ్మడు కుర్రహీరోల సరసన రొమాన్స్ చేస్తూ సీనియర్ హీరోల సరసన కూడా నటిస్తోంది. అంతేకాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఏ అవకాశం వచ్చినా కూడా వదులుకోకుండా అన్నిటికి ఒకే చెబుతూ చాలా బిజీ అయ్యింది. కెరియర్ పరంగా మంచి జోషు మీదున్న నయన్‌కు వ్యక్తిగతంగా మాత్రం పెద్దగా కలిసిరావడం లేదు అని చ్పెవచ్చు. ఈ అమ్మడు గతంలో రెండు సార్లు ప్రేమలో పడి విఫలం అయ్యింది. తాజాగా విఘ్నేష్‌శివన్‌తో సహజీవనం చేస్తుంది అని తమిళ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
పీఠల దాకా వచ్చిన పెళ్లి పెటాకులు అవడంతో నయన్ ఇక ప్రేమలో పడదు అని అంతా భావించారు కానీ నయన్ ఎంచక్కా దర్శకుడితో ప్రేమలో ఉంది. నయనతార మాజీ ప్రియులను మరిచిపోయింది. సినిమాల పరంగా మాత్రం వారి పేర్లు నయన్ వద్దకు చేరుతూనే ఉన్నాయి. కానీ వారితో నటించడానికి నయన్ ఒప్పుకోవడం లేదు. తప్పని పరిస్థితుల్లో ఒకే చెబుతోంది. ఈ అమ్మడు మాజీ లవర్ శింబుతో ఒక సినిమాలో రొమాన్స్ చేయడానికి ఒకే చెప్పింది. తాజాగా ప్రభుదేవాతో రొమాన్స్ చేయనుంది అని సమాచారం. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించినున్న చిత్రంలో హీరోగా ప్రభుదేవా, హీరోయిన్‌గా నయన్‌ను ఎంపిక చేసుకున్నారు. కానీ నయన్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. చివరకు నయన్ మాజీ ప్రియుడితో రొమాన్స్ చేయడానికి ఒప్పుకుంటుందా..? చూడాలి.