Site icon TeluguMirchi.com

బాలయ్య అడిగినా కాదందా..? ఎవరా హీరోయిన్.. !!

nayana-balakrishnaనటసింహం బాలయ్యతో జతకట్టడానికి ముద్దుగుమ్మలు ముచ్చట పడుతుంటారు. వయసు తేడాను కూడా లెక్కచేయకుండా బాలయ్య సినిమాలో నటించేందుకు పచ్చజెండాను ఊపేస్తారు. అలాంటిది స్వయంగా బాలయ్య అడిగినా ఓ ముద్దుగుమ్మ కుదరదు అందంట. ఎవరా..? హీరోయిన్ అనుకుంటున్నారు..?? ఆమె సింహా, శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్యతో ఆడిపాడిన నయనతార.

బాలయ్య “డిక్టేట‌ర్‌”లో ఓ ఐటెమ్ గీతం కోసం ముమైత్ ఖాన్‌ ని తీసుకొన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ ఐటెం సాంగ్ కోసం ముందుగా నయన తారను సంప్రదించారట చిత్ర బృందం. బాలయ్య సినిమాలో నయన్ ఉంటే సెంటిమెంట్ కలిసొస్తుందని చిత్ర బృందం ఆమె సంఫ్రచారు. నయన్ మాత్రం తనకు నటించాలని ఉన్నా కాల్షీట్లు లేవని సున్నితంగా తిరస్కరించనట్లు సమాచారమ్. బాలయ్యకు నో చెప్పిన నయన్ విజయ్ నటిస్తున్న ఓ తమిళ చిత్రంలో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పేసింది. ఈ విషయం తెలిసిన నందమూరి అభిమానులు నయన్ పై కాస్త గుర్రుగానే ఉన్నారు. బాల్యయ్యకు నో చెప్పితే భవిష్యత్ ఉండదని అభిమానులు భారీ డైలాగ్స్ వదులుతున్నారు మరీ..!!

Exit mobile version