తన పారితోషికాన్ని తాజాగా భారీగా పెంచేసింది. ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలతో సంబంధం లేకుండా తనకు ఆరుకోట్లు ఇస్తేనే డీల్ ఒకే అంటోంది. నయన్ డిమాండ్‌తో హీరోయిన్ల పారితోషికాలు అమాంతం పెరుగుతున్నాయి. చేతినిండా ప్రాజెక్ట్‌లతో రంజు మీదున్న నయన్ మరీ ఇంతలా రేటు పెంచడంతో దర్శకనిర్మాతలు షాకవుతున్నారు. ఏది ఏమయినా నయన్ డేట్ల కోసం ఎంతడిగినా ఇవ్వక తప్పదు కదా. అందుకే మరీ ఇంతలా రేటు పెంచినా ఆఫర్లలో వచ్చే మార్పు ఏం ఉండదు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలి అనే సూక్తి నయన్ బాగా ఒంట బట్టించుకున్నట్టుంది. అందుకే హిట్లు ఉన్న సమయంలో భారీ రేటును డిమాండ్ చేస్తోంది.