దర్బార్ లో నయన్ రోల్ ఇదేనట..

సంక్రాంతి బరిలో అల..వైకుంపురం లో , సరిలేరు నీకెవ్వరూ తో పాటు దర్బార్ , ఎంత మంచివాడవు రా చిత్రాలు కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. అందరి కంటే ముందు రజనీకాంత్ దర్బార్ తో సంక్రాంతి సందడిని మొదలు పెట్టబోతున్నాడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఈ మూవీ జనవరి 09 న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో దర్బార్ కు సంబందించిన ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రజని భార్య పాత్ర చేస్తున్న నయనతార వృత్తి రీత్యా ఆర్కిటెక్ గా కనిపిస్తారట. కథలో ఆమె పాత్ర కూడా చాల కీలకం అని తెలుస్తుంది. మరి ఆమె ప్రేక్షకులను ఎంతమేరకు ఆ పాత్ర తో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక జనవరి 3వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళ వేదిక లో ఈ వేడుకను గ్రాండ్ గా జరపబోతున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నాడు. నివేద థామస్ ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.