Site icon TeluguMirchi.com

నయనతారతో రోమాన్స్ కష్టం

nayan

నయనతార జోరు మాములుగా లేదు. మూడు పదులు వయసు దాటినా ఆమె జోరు తగ్గలేదు. ఇప్పటికీ ఆమెనే టాప్ హీరోయిన్. ఇటు సినియర్ అటు జూనియర్ హీరోలతో జతకట్టేసి నెంబర్ వన్ కధానాయికగా దూసుకుపోతుంది నయన్. అయితే ఇకపై ఆమెను గ్లామర్ డాల్ గా చూడటం కష్టం అని చెబుతున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. గతకొద్ది కాలంగా ఫిమేల్ ఓరియంటెడ్ కథలతో అలరిస్తున్న నయన్ .. ఇకపై కూడా హీరోలతో రోమాన్స్ పడించే చిత్రాలకు నో చెప్పాలని డిసైడయ్యిందట.

ఇటివలే టాలీవుడ్ కు చెందిన ఫిల్మ్ మేకర్స్ కొందరు నయనతారను కలిశారట. బాడా హీరోల సినిమా కోసం ఆమెతో సంప్రడింపులు జరిపారట. అయితే వాటిని తిరస్కరించిన నయనతార.. ఫిమేల్ ఓరియంటెడ్ కథలతో తన వద్దకు రావాలని సూచించిందట. సినిమాలో బలమైన పాత్రలు ఉంటేనే తన వద్దకు రావాలని క్లియర్ గా చెప్పేసిందట. త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న నయన్ ఇపై ఇంలాంటి గ్లామరస్ పాత్రలు దూరంగా జరగాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్ టాక్.

Exit mobile version